AP: తిరుమల అలిపిరి మెట్లమార్గంలో 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని చెప్పారు.