ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్లకు చెందిన వారు ఓటింగ్లో పాల్గొన్నారు. అధ్యక్షుడు, కార్యదర్శి సహా 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడు బరిలో ఉండటం విశేషం. కాగా సా.4 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుండగా.. సా. 6 గంటలకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.