2025లో గర్వించదగిన క్షణాలను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్‌తో భారత్ ప్రపంచ దేశాలకు తన బలాన్ని చూపించిందని.. దేశ భద్రత పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. దేశంలోని ప్రతిపౌరుడికి ఈ ఆపరేషన్ గర్వకారణంగా మారిందన్నారు. ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా ఇదే స్ఫూర్తి కనిపించిందని పేర్కొన్నారు.