MNCL: మందమర్రి మండలం పొన్నారం ZPSS పాఠశాల విద్యార్థి కాళి జగన్ ప్రతిభ చాటాడు. SGF అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఇన్ఛార్జ్ HM రఫెల్ రెడ్డి, PD పాశం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జగన్ పాల్గొననున్నారు. విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు.