NRML: అక్రిడిటేషన్ కార్డుల జారి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 252 జీవోను సవరించి పాత్రికేయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే 143 యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవోతో పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.