NLR: కావలి పట్టణ శివారులోని మద్దూరుపాడు వద్ద ఆదివారం జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని వెనుకగా వచ్చిన ఇథనాల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. కావలి గ్రామీణ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.