WG: ఉండి మండలం పెదపుల్లేరులో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఓ బాలుడితో పాటు మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స అందించి, రాబిస్ వ్యాక్సిన్ వేయించాలని వైద్యులు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.