ములుగు రోడ్డులోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దత్త జ్ఞానబోధ సభ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో భక్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. డాక్టర్ శర్వాణి, ఫార్మాసిస్ట్ సిబ్బంది పాల్గొని రోగులకు సలహాలు అందించారు.