సత్యసాయి: మచిలీపట్నం-ధర్మవరం రైలును హిందూపురం వరకు పొడిగించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నకు వినతిపత్రం అందజేశారు. వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని కలిసి ఆయన విన్నవించారు. దీనివల్ల మడకశిర, పెనుకొండ ప్రాంతాల విద్యార్థులు, వర్తకులు, కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.