టీమిండియా కొత్త ఏడాదిని న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో ప్రారంభించనుంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు వన్డేల సిరీస్‌కు భారత్ త్వరలోనే తమ జట్టును ప్రకటించనుంది. అయితే, ఈ సిరీస్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.