BHPL: టేకుమట్ల మండలాల్లోని HP గ్యాస్ వినియోగదారులు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీ అధికారులు సూచించారు. పెండింగ్లో ఉన్నవారు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ప్రక్రియ పూర్తి చేయాలని వారు కోరారు. ఈ-కేవైసీ చేయకపోతే ప్రభుత్వ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. త్వరగా పీకేవైసీ చేయించుకోవాలని అధికారులు వినియోగదారులను కోరారు.