SRPT: న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మునగాల ఎస్సై ప్రవీణ్ ఆదివారం ఒక ప్రకటనలో మండల ప్రజలకు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలో సంతోషంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు.