రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి క్లాస్ జలాంతర్గామి ‘INS వాఘ్షీర్’లో బయలుదేరారు. నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి రాష్ట్రపతి వెంట ఉన్నారు. రెండు నెలల క్రితం రాష్ట్రపతి రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేసిన విషయం తెలిసిందే.