SKLM: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అశోక్ బాబు అన్నారు. గ్రామీణ క్రీడలు నిర్వహించడం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. కంచిలి(M) మకరాంపురంలో టీ-20 క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు బ్యాట్ పట్టుకుని స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారులకు ప్రోత్సాహం అందించారు.