BHNG: ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ, రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ సభ్యులు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని అతని నివాసంలో కలిసి కోరారు. అఖిలపక్ష కమిటీ సభ్యుల సూచనకు, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని అఖిలపక్ష కమిటీకి ఆయన హామీ ఇచ్చారు.