TG: రైతుబంధు పాలన పోయిందని.. రాబందుల పాలన వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లపై పడాల్సి వస్తోందన్నారు. యూరియా పంపిణీలో పదేళ్లలో లేని దుస్థితి ఇప్పుడే ఎందుకు అని నిలదీశారు. మార్పు అని ఊదరగొట్టి.. అడ్డగోలు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. అడ్డగోలు హమీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.