GNTR: తెనాలితో పాటు జిల్లాలోని పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను తెనాలి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ మల్లికార్జునరావు, ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు పరమాయకుంటకు చెందిన సయ్యద్ ఖాజా తెనాలి వన్ టౌన్, త్రీ టౌన్, పాత గుంటూరు, పెదకాకాని తాడేపల్లి పీఎస్‌ల పరిధిలో ఆటోలు, బైక్‌లు, సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.