VZM: దత్తిరాజేరు మండలం కోమటిపల్లి జంక్షన్ వద్ద నేషనల్ హైవేపై ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్దానికుల వివరాల ప్రకారం లారీ ఆటోను ఢీ కోట్టడంతో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించగా వారు క్షతగాత్రులను గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు.