విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా అవిష్కరణ చేశారు. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. భారత దేశ స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందన్నారు.