W.G: పెద అమిరంలో ఆదివారం రతన్ టాటా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహం వద్ద డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి నివాళులర్పించారు. బాబా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నిత్య కృషీవలుడైన ఆయన ప్రజల మదిలో చిరంజీవిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని రతన్ టాటా సేవలను స్మరించుకున్నారు.