EG: రాజమండ్రి రూరల్ మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను బుధవారం పంపిణీ చేయనున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జనవరి 1కి బదులు డిసెంబర్ 31నే ఒక రోజు ముందుగా పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సునీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆదివారం తెలిపారు. మండలంలోని 19,870 మంది లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా ఇంటి వద్దకే పింఛన్ సొమ్ము అందజేస్తామన్నారు.