KKD: గొల్లప్రోలులో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో వారం రోజులుగా చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని, ఈగలు, దోమలతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వాపోతున్నారు. సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని కోరుతున్నారు.