PDL: రామగుండం సింగరేణి బాధితులకు త్వరలో న్యాయం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఆదివారం తనను కలిసిన మారుపేర్లు, విజిలెన్స్ కేసుల బాధితులకు ఆయన భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి, భూపాలపల్లి సభలో ఇచ్చిన హామీ మేరకు సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ భేటీలో పలువురు కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.