NLR: కావలి పట్టణంలోని శాప్ గ్రౌండ్లో కేసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటును MLA కావ్య కృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి MLA క్రికెట్ ఆడారు. ప్రతి బాల్‌ను కొడుతూ మంచి బ్యాటింగ్ ప్రదర్శించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై ఆసక్తి చూపే విధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందించారు.