GDWL: కార్మికుల రక్తాన్ని ధారపోసి సాధించుకున్న 29 చట్టాలను కేంద్రం రద్దు చేసి, కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం శ్రమజీవుల హక్కులపై గొడ్డలిపెట్టు అని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఉప్పేర్ నరసింహ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో రవాణా రంగ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సభలు ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు జరుగుతాయన్నారు.