సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం PM మోదీ ప్రసంగించిన 2025 సంవత్సరం చివరి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఆలకించారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఈ రేడియో ప్రసంగాన్ని విన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన ప్రసంగం ద్వారా దేశ ప్రజలలో స్ఫూర్తిని నింపుతున్నారని కొనియాడారు.