VKB:పెద్దేముల్ మండలంలోని జనగాం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు 15 రోజులుగా మంచినీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తాగునీటి కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.