సిద్దిపేట జిల్లాలో వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, వాటి కోసం షెల్టర్ హోమ్ నిర్మించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. కుక్కల బెడద లేకుండా తగిన ప్రణాళికలు రూపొందించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.