దేశవ్యాప్తంగా డెలివరీ, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో డిసెంబర్ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ తదితర ఆన్లైన్ డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి. పని పరిస్థితులు మెరుగుపర్చడం, న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. కొత్త సంవత్సర వేడుకల సమయంలో సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.