ATP: గుత్తి కోటలోని కొండపై వెలిసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 30న ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అంజి, నరసింహ, విజయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు.