MDCL: రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో యెల్లంపేట మున్సిపాలిటీలో BJP జండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కంచుగంట మహేష్ అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ తనపై నమ్మకంతో మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలను మహేష్ తెలిపారు. కార్యకర్తలు అందరితో సమన్వయంగా పనిచేస్తానని అన్నారు.