TG: శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు.