తల్లి అయ్యాక తన శరీరాన్ని, అందాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయిందని నటి కియారా అద్వానీ చెప్పింది. ‘వార్ 2లో బికినీ షాట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ డెలివరీ అయ్యాక నా శరీరంలో తేడా కనిపించింది. గతంలో ఉన్నట్లు ఉండగలనా అనిపించింది. కానీ అందం, శరీరం ముఖ్యం కాదు. ఇప్పుడు నేను ఎలా ఉన్నా, నన్ను నేను గౌరవించుకుంటా. నాకు మాతృత్వం నేర్పిన పాఠాలివి’ అని పేర్కొంది.