TG: హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాటేదాన్ టాటానగర్లోని ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.