ASR: కొయ్యూరు మండలంలోని రామరాజుపాలెం వంతెన వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కేడీపేట వైపు వెళుతున్న ఓ ఐచర్ వాహనం వంతెన వద్ద డివైడర్ను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదన్నారు. బలంగా ఢీకొనడంతో డివైడర్ గోడ, ఐచర్ ముందు భాగం బాగా దెబ్బతిన్నాయని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించారు.