సంగారెడ్డి పట్టణంలోని భవాని భువనేశ్వరి దేవాలయంలో కోటి శ్రీ రుద్ర సూక్త పాలన కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాలతో అభిషేక కార్యక్రమాలను చేశారు.