AP: అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని కోరుతూ రాయచోటిలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. పట్టణంలోని నేతాజీ కూడలిలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. ‘రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి.. మదనపల్లె వద్దు-రాయచోటి ముద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వ్యాపారస్థులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.