NDL: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీ ఇంటికి మీ డాక్టర్’ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు జి. రాజకుమారి ఆదివారం తెలిపారు. నంద్యాల జిల్లాలోని గూడేలలో నివసిస్తున్న నిరుపేద చెంచు గిరిజన కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మొబైల్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు.