ASR: ట్రాఫిక్ రద్దీ కారణంగా అరకు ఘాట్ రోడ్లో ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నట్లు అరకులోయ ఎస్సై జి గోపాల్ రావు తెలిపారు. ఈరోజు నుంచి తదుపరి ఉత్తరాలు వచ్చేవరకు అరకు ఘాట్ రోడ్లో విశాఖ, ఎస్ కోట నుంచి అరకులోయ వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలిపారు. అరకులోయ నుంచి విశాఖ, ఎస్. కోట వెళ్లే వారు పాడేరు ఘాట్ రోడ్డును ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు.