KMM: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మధిరలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు.