MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ఆదివారం సర్పంచ్ మాదారి ప్రశాంత్ గొర్రెలు, మేకలకు నట్టల మందును వేశారు. గొర్రెల ఆరోగ్యానికి నట్టల మందు తప్పనిసరి అన్నారు. నట్టల మందు వినియోగంతో పశువుల్లో ఉండే పురుగులు నివారించబడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నట్టల మందును పెంపకం దారులు వినియోగించుకోవాలని కోరారు.