నేలపై కూర్చోవడం వల్ల వెన్నెముక సహజ స్థితిలో ఉంటుంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా కింద కూర్చోవడం వల్ల పొట్ట, వీపు కండరాలు బలోపేతమవుతాయి. వెన్నునొప్పి తగ్గుతుంది. కాళ్లు ముడుచుకుని కూర్చోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. మహిళలు నేలపై సరైన భంగిమలో కూర్చోవడం వల్ల పెల్విక్ కండరాలు బలపడతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.