NZB: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఆదేశాల మేరకు సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు, జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలనే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టారు.