SDPT: కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ తెలిపారు.మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పేరును మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు ప్రతి గ్రామంలో గాంధీ చౌరస్తాల వద్ద గాంధీ ఫొటోలతో నిరసన తెలపాలన్నారు.