కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. కాంగ్రెస్ ఒక సిద్ధాంతమని.. అది ఎప్పటికీ నశించదని చెప్పారు. తమ పోరాటం అధికారం కోసం కాదని.. దేశం కోసమని పేర్కొన్నారు. ‘మేం ప్రస్తుతం అధికారంలో లేకపోవచ్చు. కానీ.. రాజ్యాంగం, ప్రజల హక్కుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు’ అని పేర్కొన్నారు.