KKD: జగ్గంపేట మండలం బలభద్రపురంలోని ఒక పామాయిల్ తోటలో జరుగుతున్న కోడిపందాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అందిన సమాచారం మేరకు ఎస్ఐ టి.రఘునాథరావు తన సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించినట్లు సీఐ వైఆర్ కే శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు పందెంరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు కోళ్లు రూ.40,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.