MDK: గాలిపటాల ఎగరవేయడంలో నిషేధిత చైనా మంజా వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. సంక్రాంతి పురస్కరించుకుని జరుపుకునే కైట్ పెస్టివల్ కార్యక్రమాలలో సాధారణ దారంనే వాడాలని సూచించారు. అలా కాదని ఎవరైనా చైనా మాంజా వాడిన, విక్రయించిన నేరమే అని అన్నారు. ముఖ్యంగా వ్యాపారులు నిషేదిత వస్తువుల అమ్మకాలు చేయవద్దని హెచ్చరించారు.