NLG: నల్గొండ మండలం దండెంపల్లి గ్రామం మంచం పట్టింది. గ్రామంలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నారు. గత 15 రోజులుగా 60మందికి పైగా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతోనే విష జ్వరాలు వ్యాపిస్తున్నాయంటున్నారు. వైరల్ జ్వరాలు వ్యాపించకుండా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.