WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ ఎస్సీ కాలనీలో రహదారి పై ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభం కింది భాగం తుప్పు పట్టి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం రాకపోకలు సాగే మార్గంలో ఈ స్తంభం ముప్పుగా మారింది. వెంటనే స్పందించి స్తంభాన్ని మార్చాలని అధికారులను గ్రామస్థులు డిమాండ్ చేశారు.