NLG: నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో తలనీలాల సేకరణకు వేలం నిర్వహించారు. ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు సమక్షంలో జరిగిన ఈ వేలంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన కేఎం హెయిర్ ఇంటర్నేషనల్ సంస్థ ₹2.50 కోట్లకు తలనీలాల సేకరణ హక్కును దక్కించుకుంది. ఆలయ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.